calender_icon.png 31 October, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ప్రమాదంలో లైన్‌మెన్‌కు గాయాలు

03-07-2024 11:48:38 AM

పరిస్థితి విషమం హైదరాబాద్ కు తరలింపు

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: విద్యుత్ మరమత్తు పనులు చేస్తుండగా జూనియర్ లైన్మెన్ విద్యుత్ షాక్ గురయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా సరస్వతి దేవాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నాగర్ కర్నూల్ పట్టణం దేసిటిక్యాల గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి జూనియర్ లైన్మెన్ బుధవారం మరమత్తు పనుల కోసం సరస్వతీ దేవాలయం పరిసరాల్లో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఒకసారిగా షాక్ గురయ్యాడు.  వెంటనే స్థానికులు సిబ్బంది గమనించి 108 సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.