calender_icon.png 16 October, 2024 | 7:51 PM

గ్రూప్1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్

16-10-2024 03:33:13 AM

వేర్వేరు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): గ్రూప్1 నోటిఫికేషన్‌పై దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యానికి నిరాకరించింది. ఎనిమిది ప్రశ్నలపై పిటిషనర్లు లేవనెత్తిన సందేహాలకు కమిషన్ ఇచ్చి న సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని తేల్చిచెప్పింది.

ఉన్నతాధికారుల పోస్టు ల నియామకాలకు కోసం నిర్వహించే గ్రూప్1 పరీక్షల్లో సూటిగా ప్రశ్నలు ఉండాలని పిటిషనర్లు కోరడం సరికాదంది. అభ్య ర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు మెలికలతో కూడిన ప్రశ్నలు ఉండాలన్న కమిషన్ వాదన ఆమోదయోగ్యంగా ఉందని పేర్కొంది. 1,721 మంది వ్యక్తంచేసిన 6,417 అభ్యంతరాలను ఆయా సబ్జెక్టులకు చెందిన నిపుణుల కమిటీ పరిశీలించిందని తెలిపింది.

పరిశీలన తర్వాతే కీ విడుదల చేసిందని చెప్పింది. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేసిందని వివరించింది. ఈ వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తీర్పు వెలువరించింది. 2022లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష నిర్వహించాలన్న మరో పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం తీర్పు వెలువరించారు.

గ్రూప్1 ప్రాథమిక పరీక్ష ఎంపికకు కాదని, కేవలం అభ్యర్థుల అర్హత నిర్ధారణకు మాత్రమేనని చెప్పింది. ఒక పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేస్తారని, విద్యాసంబంధమైన విషయాల్లో నిపుణుల అభిప్రాయంలో జోక్యం తక్కువ గా ఉంటుందని స్పష్టంచేసింది. సరైన సమాధానాలను గుర్తించే ప్రక్రియలో కోర్టుకు అ నుమతి ఉండదని సుప్రీంకోర్టు తీర్పులను పేర్కొంది.

నిపుణుల కమిటీ నిర్ణయమే అం తిమమని వెల్లడించింది. సాంకేతిక అంశాల కు చెందిన వాటిపై కోర్టు తన సొంత అభిప్రాయాలను చొప్పించడానికి వీల్లేదని.. ఆ యా అంశాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన నేపథ్యంలో పిటిషన్లను కొట్టేస్తున్నట్టు తీర్పులో పేర్కొంది. తొలి నో టిపికేషన్ రద్దు చేసిన ఆరు నెలల తరువా త పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది.

ఇన్ని రోజుల జాప్యానికి  కారణా లు వివరించలేదని తప్పుపట్టింది. 2022లో జా రీచేసిన నోటిఫికేషన్ రద్దు వల్ల పిటిషనర్లకు నష్టం వాటిల్లినట్టయి తే ఈ ఏడాది ఫిబ్రవరిలో వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాత కోర్టు కు వ చ్చే అవకాశం ఉన్నా రాలేదని పేర్కొం ది. ఈ ఒక్క కారణం మీదనే నోటిఫికేషన్ ర ద్దు వ్య వహారంలో జోక్యం చేసుకోలేమని స్ప ష్టంచేసింది.

ప్రశ్నలకు సంబంధించి ఒక్క పిటిష నర్ మాత్రమే నిర్ది ష్ట గడువులోగా అభ్యంతరాలను సమర్పించారని, వాటిని మాత్రమే కమిషన్ పరిగ ణనలోకి తీసుకొందని తెలిపింది. పిటిషనర్లు 14ప్రశ్నలపై అభ్యంత రాలు వ్యక్తం చేశారని, వాదనల సమయానికి అవి ఎనిమిదికి తగ్గాయని చెప్పింది.

అ త్యన్నత స్థాయి పోస్టుల భర్తీకి జరిగే పరీక్షల్లో ప్రశ్నలు మెలిక లేకుండా నేరుగా ఉండాలని కోరుకోవడం సరికాదని సూచించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల ౨౧ నుంచి మెయి న్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.