calender_icon.png 10 October, 2024 | 2:54 AM

అణు జలాంతర్గాములకు లైన్‌క్లియర్

10-10-2024 01:01:10 AM

దేశీయంగా నిర్మాణానికి క్యాబినెట్ కమిటీ ఆమోదం

ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత నేవీ, రక్షణ దళాల సామర్థ్యం పెంపు, భద్రత కోసం క్యాబినెట్ కమిటీ కీలక ఒప్పందాలను ఆమోదించింది. రెండు అణు జలాంతర్గాములను దేశీయంగా నిర్మించడంతో పాటు అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది.

విశాఖప ట్నంలోని షిప్‌బిల్డింగ్ కేంద్రంలో ఈ సబ్‌మెరైన్లను నిర్మించేందుకు దాదాపు రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణంలో ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు భాగస్వామ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రిడేటర్ డ్రోన్లకు సంబంధించి ఎప్పటినుం చో ప్రతిపాదనలు ఉన్నాయి. అమెరికా సూచనల ప్రకారం అక్టోబర్31కి ముం దే ఈ డీల్‌కు అంగీకారం తెలపాల్సి ఉంది. ఒప్పందం తర్వాత నాలుగేళ్లకు భారత అమ్ములపొదిలో ఇవి చేరుతాయి.