బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల మండలంలోని చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోతులూరి రాజు గౌడ్ అనే గీత కార్మికుడు సోమవారం ఈత చెట్టు పై నుండి కళ్ళు గీస్తున్న క్రమంలో కిందపడి గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెన్నుపూస విరిగిందని వైద్యులు తెలపడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాజు గౌడ్ ని హైదరాబాదుకు తరలించారు. గాయపడ్డ రాజు గౌడ్ ను ప్రభుత్వం ఆదుకోవాలని మండల గీత కార్మిక సంఘం అధ్యక్షులు మల్ల గౌడ్ కోరారు.