calender_icon.png 10 March, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉడ్తా పంజాబ్ సీక్వెల్‌కు లైన్ క్లియర్

06-03-2025 12:00:00 AM

2016లో వచ్చి మంచి విజయం సాధించిన చిత్రాల్లో ‘ఉడ్తా పంజాబ్’ ఒకటి. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా వారికి ఒక శుభవార్త అందింది. ఈ సినిమా సీక్వెల్ కోసం లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. దీనిపై ఏక్తా కపూర్ వర్క్ చేస్తున్నారట. పంజాబ్‌కు సమస్యగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ క్రైమ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి అభిషేక్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఈ సీక్వెల్‌లోనూ షాహిద్ కపూరే హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుందని తెలుస్తోంది. ఒరిజినల్ చిత్రానికి అభిషేక్ చౌబే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయనకు చేతినిండా చిత్రాలుండటంతో సీక్వెల్‌కు దర్శకత్వం వహించరని తెలుస్తోంది.

తొలి భాగం కథను సీక్వెల్‌లో కొనసాగించరని సమాచారం. కానీ పంజాబ్ డ్రగ్స్ సమస్యపై మాత్రం ఫోకస్ పెడతారట. సీక్వెల్‌లో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్‌తో ఆసక్తికరంగా సినిమాను రూపొందిస్తారట. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది.