- హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట
- అక్రమ నిర్మాణాలను తొలగించాలన్న కోర్టు
- సర్వే పనులను అడ్డుకోవద్దంటూ సూచన
- భవిష్యత్ కార్యచరణపై ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): హైకోర్టు తీర్పుతో ‘మూసీ’ పునరుజ్జీవనానికి లైన్ క్లియర్ అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. మూసీ పునరుజ్జీవనంపై దాఖలైన 46 పిటీషన్లను ఇటీవల విచారించిన హైకో ర్టు హైదరాబాద్ నగర చరిత్రను, చట్టాలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చ ర్యలను సమర్థించింది.
అంతేకాకుండా, మూ సీ పునరుజ్జీవనాన్ని పిటీషనర్లు, ఆక్రమణదారులు ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవద్దంటూ హితవు పలికింది. ఈ నేపథ్యంలో ఇక మూ సీ పు నరుజ్జీవనం పనులకు అడ్డంకులు తొ లగినట్టుగా భావిస్తూ భవిష్యత్ కార్యాచరణ పై దృష్టిని కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది.
హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట..
మూసీ పునరుజ్జీవనంలో భాగంగా రివర్ బెడ్‌లో నివసించే వారిని ఖాళీ చేయించేందు కు ప్రభుత్వం చేపట్టిన ఆర్‌బీఎక్స్ మార్కింగ్ పెద్ద దుమారమే రేపింది. ఈ సమయంలో బాధితుల తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేయ డం, వారికి రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలవడంతో మూసీ పునరుజ్జీవనం ప నులు నిలిచినట్టుగానే కన్పించింది.
దీనికి ప్ర తిగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన త న పుట్టినరోజున మూసీ పరీవాహక ప్రాం తంలో పాదయత్ర చేసి మూసీ పునరుజ్జీవ నం చేసి తీరుతామని ప్రకటించారు. తాజా గా మూసీ పునరుజ్జీవనం, పరివాహక ప్రాం తంలో నివసించే బాధితుల పక్షాన దాఖలైన 46 పిటీషన్లను హైకోర్టు విచారించింది.
ఈ విచారణలో హైదరాబాద్ నగర చరిత్ర, మూసీ వరదలు, జల సంరక్షణకు నిజాం స్టేట్‌లో ఉన్న చట్టాలను ప్రస్తావించింది. ఈ తీర్పులో ప్రభుత్వం చేపట్టే మూసీ పునరుజ్జీవనం చర్యలను అడ్డుకోవద్దని చెబుతూనే.. ఆక్రమణలు తొలగించేందుకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
మూసీ నది పరిధి లో ఆక్రమణల తొ లగింపునకు సంబంధించి ట్రయల్ కోర్టులు స్టేలు, ఇన్‌జంక్షన్ ఆర్డర్లు ఇచ్చే ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలొమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కేసులో హై కోర్టు డివిజన్ బెంచ్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
భవిష్యత్ కార్యచరణపై కసరత్తు..
మూసీ పునరుజ్జీవనం చర్యలపై ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టులో తీర్పు రావడంపై ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆక్రమ ణలను తొలగించేందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలని పేర్కొనడంతో తదుపరి కార్యాచరణను ఎలా కొనసాగించాలనే దానిపై ప్రభుత్వ వర్గాలు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మూసీ బాధితులకు ఎంత నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.. ఎంత మందికి పునరావాసం కింద ఆవాసాలను సమకూర్చాల్సి ఉం టుంది అనే విషయాలపై ప్రభుత్వం చర్చి స్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మూసీ పునరుజ్జీవనం పనులను ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.