calender_icon.png 5 April, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్

05-04-2025 02:17:53 AM

  • జీవో\ 29పై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు
  • ఇప్పటికే జీఆర్‌ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
  • త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): గ్రూప్ 1 నియామకాల విషయంలో సు ప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం.29 రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. తాజా నిర్ణయంతో త్వరలోనే అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనుంది.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో నెం.55కు సవరణగా ప్రభుత్వం 2024, ఫిబ్రవరి 28న జీవో 29ని జారీ చేసింది. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. 

ఏమిటీ జీవో 29 ఇష్యూ

మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్‌లో ప్రిలిమినరీ, అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో గత ప్ర భుత్వం ఇచ్చిన 55 జీవో రద్దు చేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చింది. జీవో 55తో పోలిస్తే జీవో 29 వల్ల రిజర్వ్‌డ్ వర్గాలకు అన్యాయం జరుగుతుందనేది కొంత మంది అభ్యర్థుల వాదన.

జీవో 29 ప్రకారం ఓపెన్‌లో రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్సుండదు. టాప్ మార్కులు వచ్చినా రిజర్వేష న్‌లోనే పరిగణించడంతో మరో రిజర్వుడ్ అభ్యర్థికి అవకాశం ఉండదని అభ్యర్థులు అభిప్రాయం. దీంతో జీవో 29ను రద్దు చే యాలని అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారు. ఆ జీవో 29 ప్రకారం రిజర్వేషన్ క్యాటగిరి అన్నదాన్ని తీసేశారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్థుల్లో 100 పోస్టులకు 5 వేలమందికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు.

సాధారణంగా 5 వేల మందిలో 2,500 మంది రిజర్వుడ్ క్యాటగిరిల్లో, మిగిలిన 2,500 మంది ఓపెన్ క్యాటగి రిలో ఉండాలి. కానీ జీవో 29 ప్రకారం మొ త్తం 5 వేలమంది ఓపెన్ క్యాటగిరిలోనే మె యిన్స్ పరీక్షలు రాయాల్సి వస్తుందని అభ్యర్థుల వాదన.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఓపెన్ క్యాటగిరిలో పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాల ఎంపికలో మాత్రం రిజర్వేషన్ అమలు చేస్తామని చెబుతుండటాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిం చారు. తాజా సుప్రీం నిర్ణయంతో గ్రూప్ 1 తుది నియామకానికి లైన్‌క్లియర్ అయ్యింది.