11-04-2025 01:56:08 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ‘దేశ ప్రజలకు తక్కువ ధరకు నా ణ్యమైన మెడిసిన్ అందివ్వాలి.. తద్వారా వారి ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇవ్వాలి’ అనే ధ్యేయంతో 2008లో కేంద్ర ప్రభు త్వం ‘భారతీయ జన ఔషధి పరియోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తం గా వేలాది ‘జన ఔషధి’ కేంద్రాలను ప్రా రంభించింది. 28 ఫిబ్రవరి 2025 నాటికి దేశవ్యాప్తంగా కేంద్రాల సంఖ్య 15,057గా నమోదైంది.
వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్యను 25,000కు పెంచాలని కేం ద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. కేంద్ర ప్ర భుత్వం తెలంగాణకు కేవలం 199 కేం ద్రా లు కేటాయించినప్పటికీ, వాటికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభి స్తు న్నది. సంఖ్యాపరంగా మన రాష్ట్రం దేశం లో 19వ స్థానంలో నిలుస్తున్నది. కేం ద్రా ల్లో లభించే జనరిక్ మెడిసిన్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, డిమాండ్‌కు తగిన విధంగా కేంద్రం రా ష్ట్రంలో కేంద్రాల సంఖ్యను పెంచడం లేదు.
రాష్ట్రంలో మంచి డిమాండ్..
దేశవ్యాప్తంగా 15,057 జన్ ఔషధి కేం ద్రాల సంఖ్య ప్రకారం.. ప్రతి 10 లక్షల జనాభాకు 11 కే్ంరద్రాలు అందుబాటులో ఉన్నట్లు లెక్క. కానీ.. తెలంగాణకు కేటాయించిన 199 కేంద్రాల పరంగా చూస్తే.. ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2.4 కేం ద్రాలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో మరి న్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాం డ్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.
ఉత్తరప్రదేశ్ టాప్..
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పా టు చేసిన జన ఔషధి కేంద్రాల్లో తెలంగాణ వాటా కేవలం 1శాతం అయిన ప్పటికీ.. ఆ కేంద్రాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతుండడం విశే షం. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1,427, గుజరాత్‌లో 943, మహా రాష్ట్రలో 784 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. చివరి స్థానాల్లో మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి.
ప్రస్తు తం మేఘాలయలో 47, నాగాలాండ్‌లో 46 కేంద్రాల ద్వారా వినియోగదారులకు జనరిక్ మెడిసిన్ లభిస్తున్నది.దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో తమిళనాడులో 337, కర్ణాటక 473, ఆంధ్రప్రదేశ్ 276, తెలంగాణలో 199 జన ఔషధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. చివరి స్థానంలో కేరళ ఉంది.ఇక్కడ కేవలం 103 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వందశాతం నాణ్యత..
ఔషధి కేంద్రాల్లో లభించే ఒక్కో జనరిక్ మెడిసిన్‌పై వినియోగదారులకు 50 శా తం నుంచి 90శాతం రాయితీ లభిస్తుం ది. ఇక్కడ లభించే మెడిసిన్ వందశాతం డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ (జీఎంపీ), భారత అక్రిడిటిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఏబీహెచ్) నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసినవి కావడంతో కేంద్రాలకు రోజురోజుకూ మెడిసి న్‌కు ఆదరణ పెరుగుతున్నది. ఈ కేంద్రా లు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. కేంద్రాలతో ఔత్సాహిక వ్యాపారులకు సైతం చేయూతనివ్వడం జన ఔషధి పథక లక్ష్యాల్లో ఒక లక్ష్యం.