calender_icon.png 24 October, 2024 | 9:51 AM

లైక్‌లు కొడితే డబ్బులు

28-08-2024 12:16:32 AM

సైబర్ మోసగాళ్ల నయా మోసం

బాధితుడికి రూ.1.13 లక్షల టోకరా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అధిక డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపి అమాయక ప్రజలను నిండా ముంచుతు న్నారు. తాజాగా పార్ట్‌టైం జాబ్.. ఇన్‌స్టాగ్రాంలో వచ్చే పోస్టులకు లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తాం అని ఓ ప్రభు త్వ ఉద్యోగిని నమ్మించి రూ.1.13 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(29)కి దుండగులు ఫోన్ చేసి ఇన్‌స్టాగ్రాంలో వచ్చే పోస్టులకు లైక్‌లు కొడితే డబ్బులు వస్తాయని చెప్పారు.

బాధితుడు అంగీకరించడంతో అతడి సెల్‌ఫోన్‌కు మూడు వీడియో లింక్‌లు పంపారు. వాటికిలైక్‌లు కొట్టిన బాధితుడు డబ్బు అడగ్గా.. నిందితులు టెలిగ్రామ్ లింక్‌పంపి వారు సూచించిన ప్రకా రం చేయాలని చెప్పారు. మొదట్లో కొద్ది డబ్బులు లాభాలుగా పొందడంతో బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ.1.13 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. అనంతరం స్కామర్ల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.