calender_icon.png 28 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూలోకమే మురిసేలా.. ఆకాశమే అదిరేలా

13-07-2024 02:10:27 AM

యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అంబానీ పెళ్లి వేడుక 

వేల కోట్ల ఖర్చు.. 

సంప్రదాయాలకు పెద్ద పీట

ట్రెండ్‌కు తగ్గట్లు ఏర్పాట్లు.. 

ప్రీవెడ్డింగ్ దగ్గరి నుంచి ప్రతీదీ ప్రత్యేకమే.. 

ఎందరో అతిరథమహారథులకు ఆహ్వానం

బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా హాజరు

దేవతలు మురిసేలా.. దైవాన్ని మైమరిచేలా భూలోకం ఉట్టిపడేలా.. ఆకాశం అదిరిపడేలా దేవకన్యలను మరిచిపోయేలా.. గాంధార్వ వివాహాలను తలదన్నేలా మానవులు అధములు అన్నది తలకిందులయ్యేలా దేవుళ్లు కూడా అసూయపడేలా అనంత్ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయింది. 

ముంబై, జూలై 12: పెళ్లంటే నూరేళ్ల పంట అని చాలా మంది నమ్ముతారు. అది నిజమే అనేలా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, బిజినెస్ దిగ్గజమైన వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనేది కామన్ విషయమే అని అంతా అనుకున్నా కానీ ఈ పెళ్లి మాత్రం మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వరకు చేసిన ఖర్చుతో, వాళ్లు కట్టుకున్న బట్టలతో ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా ఈ పెళ్లి గురించి జనాలు మాట్లాడుకున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా ఈ పెళ్లి రికార్డులకెక్కింది. కేవలం మన దేశానికి చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులతో పెళ్లి పందిరి తళతళామెరిసిపోయింది. కేవలం వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యి ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ... తమ ఆశీర్వాదాలు అందజేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వీరి వివాహానికి వేడుకైంది. కొద్ది నెలల నుంచి వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు నిన్న జరిగిన వివాహతంతుతో ఈ జంట ఒక్కటయింది. 

ఎందరో మహానుభావులు.. 

ఈ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మహానుభావులు హాజరయ్యారు. కేవలం ఒక్క రంగానికి మాత్రమే చెందిన ప్రముఖులు అని కాకుండా అన్ని రంగాల నుంచి టైకూన్స్ అటెండ్ అయ్యారు. ఏదో పిలిచి చేతులు దులిపేసుకున్నామా అని కాకుండా వచ్చిన అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అంబానీ ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేసింది. వివాహానికి హాజరయిన అతిథులకు వడ్డించేందుకు వందల రకాల వెరైటీలు చేయిం చారు. అంతే కాకుండా వచ్చిన అతిథులను ఈజీగా గుర్తుపట్టేందుకు, వారికి రాచమర్యాదలు చేసేందుకు భారతీయ సం ప్రదాయ దుస్తులు ధరించాలని వారిని కోరారు. అంతే కాకుండా అంతర్జాతీయ అతిధుల కోసం స్పెషల్ ప్రైవేట్ జెట్స్ ఏర్పాటు చేశారు. ఇలా పెళ్లికి వచ్చిన అతిథులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అంబానీ ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లను చేసింది. అనంత్ అంబానీ వివాహ వేడుకకు వం దల సంఖ్యలో నోరూరించే వంటకాలను సి ద్ధం చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకాలతో పాటు చాలా మందికి తెలియని స్పెష ల్ వంటకాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.  

పెళ్లి ఖర్చు 5000 కోట్ల పైనే.. 

అంబానీ తన కొడుకు పెళ్లి కోసం రూ. 4,000-5,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఇది అంబానీ సంపాదనలో కేవలం 0.5 శాతమే అయినా కానీ మనలాంటి సాధారణ వ్యక్తులకు మాత్రం చాలా ఎక్కువ. అంబానీ కేవలం ఈ పెళ్లి కోసం చేసిన ఖర్చుతో చాలా మంది మిడిల్ క్లాస్ జీవితాలు బాగు చేయొచ్చు అని కొంత మంది చెబుతున్నారు.  

సంగీత్‌లో మెరిసిన రాధిక.. 

జూలై 5న ఏర్పాటు చేసిన సంగీత్ వేడుకలో పెళ్లి కూతురు రాధికా మర్చంట్ ధరించిన డ్రెస్ ఆకట్టుకుంది. అబుజానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మెరిసిపోయారు. 

హల్దీ

ఇక హల్దీ వేడుకల్లో అనంత్ చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. రాధిక డ్రెస్‌ను అనామిక ఖన్నా డిజైన్ చేశారు. 

7 నెలల నుంచి 

పోయిన సంవత్సరం డిసెంబర్‌లో రాధికా నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి పెళ్లి జరిగే జూలై 12 వరకు అంబానీ కుటుంబం ఏదో ఒక వేడుక చేస్తూనే ఉంది. రాజస్థాన్‌లోని ఆలయంలో రెండు కుటుంబాలు, అతి కొద్ది మంది సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. జనవరిలో మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. తర్వాతి రోజు ఎంగేజ్‌మెంట్ పార్టీ ఏర్పాటు చేయగా.. బాలీవుడ్ తారలతో పార్టీ నిండిపోయింది. ఇక మార్చిలో నిర్వహించిన ప్రీవెడ్డింగ్ వేడుకలైతే హైలెట్. మానవుల పెళ్లి జరుగుతుందా లేక గాంధర్వ వివాహం జరుగుతుందా అనే రీతిలో జరిగింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు 1200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అనంతరం ఇటలీలోని ఓ లగ్జరీ క్రూజ్‌లో నిర్వహించిన వేడుకలకు కూడా హైలెట్‌గా నిలిచాయి. ఇక ఈ నెల 5న ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. తర్వాత జూలై 8న హల్దీ వేడుక జరగ్గా.. నిన్న వివాహం జరిగింది. దాదాపు 134 రోజుల పాటు వీరి ప్రీవెడ్డింగ్ వేడుకలే జరిగాయి. 

జూలై 12: శుభ్ వివాహ్

జూలై 13: శుభ్ ఆశీర్వాద్

జూలై 14: మంగళ్ ఉత్సవ్ (రిసెప్షన్)

హాజరైన వారిలో  కొద్ది మంది ప్రముఖులు.. 

యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, జాన్సన్, అమెరికా మాజీ మంత్రి కెర్రీ, కెనడా మాజీ ప్రధాని హార్పర్,  స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు, రియాలిటీ స్టార్స్ కిమ్, ఖోల్ కర్దాషియన్, జాన్ సీనా, మైక్ టైసన్, ఫిఫా ప్రెసిడెంట్ జియానీ తదితరులు వచ్చారు.

అంబానీ పెట్టింది మనకంటే తక్కువే..

అనంత్ అంబానీ పెళ్లికి అయిన ఖర్చు, చేసిన ఏర్పాట్లను చూసి అహో, ఒహో అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం మన సాధారణ మధ్యతరగతి వ్యక్తుల కంటే తక్కువే ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మామూలు మధ్య తరగతి వ్యక్తి తన కుటుంబంలోని వ్యక్తి పెళ్లి కోసం తన సంపాదనలో 5 శాతం ఖర్చు చేస్తున్నాడు. అదే అంబానీ విషయానికొస్తే తన సంపాదనలో అతడు కేవలం 0.5 శాతం మాత్రమే ఖర్చు చేశాడట.. 

హాజరైన ప్రముఖులు 

(సినీ ఇండస్ట్రీ) 

మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, దిశాపటానీ, కృతిసనన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్, కరణ్ జోహార్, సంజయ్ దత్, షాహిద్ కపూర్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, కియారా అద్వానీ, సిద్దార్థ్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి, టైగర్ షాఫ్,్ర  రణ్‌బీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్, రెహమాన్, షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా ఖాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, అనిల్ కపూర్,   

టాలీవుడ్ సెలబ్రెటీలు

మహేశ్ బాబు, పూజా హెగ్డే, రామ్ చరణ్, ఉపాసన, రానా, మిహికా బజాజ్, వెంకటేశ్ తదితరులు 

క్రీడా ప్రముఖులు

ఎంఎస్. ధోనీ, సాక్షి, గౌతమ్ గంభీర్, బుమ్రా, సంజనా బుమ్రా, జయవర్ధనే, రాహుల్, అతియా శెట్టి, రహనే, జాన్ సీనా తదితరులు

కోలీవుడ్ సెలబ్రెటీలు

రజనీకాంత్, సూర్య, జ్యోతిక, నయనతార, విఘ్నేశ్ శివన్, అట్లీ తదితరులు

రాజకీయ ప్రముఖులు.. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు