అసెంబ్లీలో అందుబాటులో ఉండటం లేదు..
అలా అయితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది?
బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు పిటిషన్ ఇవ్వాలని తాము ప్రయత్నిస్తున్నామని, కానీ స్పీకర్ అసెంబ్లీలో అందుబాటు లో లేరని, స్పీకర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారో లేదో తమకు తెలియడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలోని మీడియా హాల్‌లో శనివారం మాట్లాడారు. స్పీకర్ అం దుబాటులోకి లేకపోపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేముందని ప్రశ్నించారు. పిటిషన్‌ను రిజిస్టర్ పోస్టులో పంపిస్తే, పిటిషన్ వెనక్కి తిరిగి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ్యత్వ రద్దు పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో ఉందని, అవసరమైతే తాము సుప్రీం కోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ ని బీజేపీ స్వాగతిస్తున్నదన్నారు. కానీ సీఎం రేవంత్ తెలంగాణ ప్రయోజనాల విషయం లో రాజీపడితే ఊరుకోబోమని తేల్చిచెప్పా రు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన చట్ట విరుద్ధమని అభిప్రాయ పడ్డారు. పాలవర్గాలు లేకపోవడంతో గ్రామాలు ప్రగతిలో వెనుకబడుతున్నాయన్నారు.
పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పం చ్‌లు, ఎంపీటీసీ, జెట్పీటీసీల గౌరవ వేతనం సైతం పెండింగులోనే ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు సొం తంగా సొమ్ము సమకూర్చి అభివృద్ధి పనులు చేపట్టారని, నాటి సీఎం కేసీఆర్ కనీసం ఆ పనులకు సంబంధించిన బిల్లులను సైతం విడుదల చేయలేదని నిప్పులు చెరిగారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఐదు నెలలైందని, సర్కార్ పెద్దలకు కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదన్నారు. సర్కార్ కనీసం సంక్షేమ పథకాలకు సైతం నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ఉందా? ఒకేవేళ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.