calender_icon.png 16 March, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుస్తులపై మరకలా..

16-03-2025 12:57:08 AM

బట్టలపై మరకలు పడటం సాధారణం. సబ్బుతో ఉతికినా, వాషింగ్ మెషిన్‌లో వేసి నా మరకలు పోవు. కొన్ని చిట్కాలు పాటించి మొండి మరకలను సైతం సులువుగా పోగొట్టుకోవచ్చు. 

బట్టలపై సిరా మరకలు పడితే వాటి మీద కొద్దిగా శానిటైజర్ చల్లి దూదితో రుద్దాలి. ఒక చెంచా బేకింగ్ సోడాని నీళ్లతో తడిపి ముద్దలా చేసి ఈ మిశ్రమంతో రుద్దినా సిరా మరకలు వెంటనే పోతాయి. మరక మీద కొద్దిగా డెటాల్ వేసి అయిదు నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత టూత్ బ్రష్‌తో రుద్దితే మరక పోతుంది. 

బట్టల మీద టీ లేదా కాఫీ ఒలికి మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మరకమీద రు ద్దితే ఫలితం ఉంటుంది. మరక మీద టూత్ వేస్ట్ రాసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర వాత వేడి నీళ్లతో కడిగి సబ్బుతో ఉతికితే  మరకలు పోతాయి. 

చాక్లెట్ మరకలైనపుడు ఆ బట్టలను బట్టల సోడా కలిపిన నీళ్లలో అరగంట సేపు నానబెట్టి సబ్బుతో ఉతికితే చాలు. 

బట్టలను వాషింగ్ మెషిన్‌తో వేసినపుడు కొన్నిటి రంగులు మిగతావాటికి అంటుకుంటుంటాయి. సబ్బుతో రుద్దినా ఆ మరకలు పోవు. వాటి మీద 90 శాతం ఆల్కహాల్ ఉన్న ద్రావణాన్ని చల్లి దూదితో రుద్దితే రంగుల మరకలు పోతాయి. 

నూనె మరకలు పడినపుడు వాటి మీద డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా బేకింగ్ సోడా చల్లి అరగంట తరవాత టూత్ బ్రష్‌తో రుద్దితే చాలు.