09-02-2025 12:00:00 AM
తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న స్వాసిక ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఆది సాయి కుమార్ హీరోగా రూపొందుతున్న ‘శంబాల ఏ మిస్టిక్ వరల్డ్’లో స్వాసిక హీరోయిన్‌గా నటించింది. ‘శంబాల’ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వసంత పాత్రలో స్వాసిక కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి స్వాసిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు.. ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్నింటితో పోస్టర్‌ను డిజైన్ చేసింది.
ఇవన్నీ చూస్తుంటే స్వాసిక క్యారెక్టర్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతోందనేది అర్థమవుతోంది. ‘శంబాల’ చిత్రం ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ‘శంబాల’ షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో జరుగుతోంది.