calender_icon.png 25 October, 2024 | 5:47 AM

కూలీలా.. పోలీసులా

25-10-2024 01:08:46 AM

  1. భర్తలకు న్యాయం జరగాలని భార్యల ఆందోళన
  2. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం తీసుకురావాలి 
  3. వివిధ ప్రాంతాల్లో పోలీసుల భార్యలు ఆందోళనలు
  4. సిరిసిల్లలో మహిళల అరెస్ట్
  5. డిచ్‌పల్లిలో మహిళలకు కేటీఆర్ సంఘీభావం 

సిరిసిల్ల/మంచిర్యాల, అక్టోబర్ 24(విజయక్రాంతి): పోలీసు యూనిఫారం చేసుకున్న వ్యక్తు లతో డ్యూటీ చేయించకుండా కూలీపనులు చేయిస్తారా.. ఇదేక్కడి న్యాయమంటూ వారి భార్యలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో ఆందోళన చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలో గురువారం సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌కు చెందిన పోలీసుల భార్యలు అంబేద్క ర్ చౌరస్తా వద్ద బైఠాయించి తమ భర్తలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు.  పోలీసులపై పనిభారాన్ని తగ్గించాలని డిమాం డ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మం డలం గుడిపేట 13వ బెటాలియన్ ముందు పోలీసుల కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సెలవుల విధానం మార్చాలని డిమాండ్ చేశారు. కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతిని ఉపసంహరించు కోవాలని, పనిభారాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరారు. బెటాలియన్ వ్యవస్థలోనూ ఐదేం డ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వారం రోజుల పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ, తమ బాగోగులు చూసుకునే దిక్కులేక అవస్థలు పడుతు న్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  రోజుల తరబడి డ్యూటీలు వేసి  భర్తలతో తమను ఉండ కుండా చేయడం అన్యాయమని వాపోయారు. ఉదోగ్యం చేసే చోటే నివాసం ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్, ఏఆర్ పోలీసులకు ఒక న్యాయం, తమ కో న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ న్యాయమైనా డిమాండ్‌లు నేరవేర్చేవరకు  పోరాటం అపేది లేదన్నారు. దీంతో కొద్దిసేపు రాకపోకలు అంతరాయం వాటిల్లింది. సిరిసిలల్లో డీఎస్పీ చంద్ర శేఖర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసి నా వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి, బెటాలియన్‌కు పంపించారు. అధికారుల హామీతో మంచిర్యాలలో ధర్నాను విరమించారు. 

పోలీసుల భార్యలకు కేటీఆర్ సంఘీబావం

కామారెడ్డి,అక్టోబర్24(విజయక్రాంతి): రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలంటూ గురువారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి 7వ బెటాలియన్ ఎదుట 44వ జాతీయ రహదారిపై పోలీసుల భార్యలు ధర్నాకు దిగారు. తమ పిల్లలతో కలిసి   రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో రైతులను కలిసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్  వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌ని రోడ్డుపై ఆపి మహిళలకు సంఘీభావం తెలిపారు. పోలీసులకు ఒకే  విధానం అమలు చేయాలని, అధిక పనిభారం మోపవద్దని కేటిఆర్‌కు వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చచచారు. ప్రభుత్వం వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.