మలయాళీ భామ ఆరాధ్య దేవితో సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ‘శారీ’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. సాధారణ చీరలో తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. ఆ ప్రేమ ఎక్కువై చివరకు సైకోగా ఎలా మారాడు అన్నది ఈ మూవీలో చూపించనున్నారు.
డైరెక్టర్ గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్జీవీకి చెందిన ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతుండగా రవివర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, రెండు పాటలు రిలీజ్ చేయగా ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట కూడా విడుదలైంది.
‘ఎగిరే గువ్వలాగా గాల్లో తేలిపోనా.. ఎగసే అలలపై నే వాలిపోనా..’ అంటూ మెలోడీగా సాగుతున్న ఈ పాటకు సాహిత్యం, బాణీని రాకేశ్ పనికెల అందించగా, సిద్ధార్థ్ సిద్దూ సంగీత సారథ్యంలో సాయి చరణ్ ఆలపించారు. రచిత రాయప్రోలు ఆలాపనతో ఆరంభమయ్యే ఈ సాంగ్ బీట్ వినసొంపుగా ఉంది.