calender_icon.png 31 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశాదీపాలు

30-10-2024 12:00:00 AM

దీపావళి వెలుగు 

కోటి కాంతుల దీపావళి కోసం

కొత్త ఆశల చిగురింతకై 

మనసు వాకిట్లో కట్టుకున్న గూడు 

తారాజువ్వలై వెలిగి 

విరజిమ్మిన నూతనోత్సాహం 

సిరుల పంటగా నిలిచి 

ప్రతి హృదయం పులకించగ 

పుడమి తల్లి పరవశించి 

పంచుకున్న ఆనందం

పెంచుకున్న మమకారం 

పంచిపెట్టు అందరికీ నీ వంతుగా...!

 -డా. చిటికెన కిరణ్‌కుమార్ 



దీపాలంటే నిత్యం

మన నవ్వులతో

ముఖాలలో వెలగాలి

పసిపిల్లల మోముపై

చూడాలి దీపావళి

ఎగిరేటి పక్షిలో మెరిసేటి తారలలో 

పారేటి జలపాతంలో 

ఉదయించే సూర్యుడిలో

పౌర్ణమి వెన్నెలలో తుషార బిందువులో

మెరిసే వజ్రాన్ని వెతికితే

రోజూ దీపావళి! 

చీకటి మనసులలో వెలుగుని నింపుకుని 

బాధలను తెంచుకుని

సమస్యలను దించుకుని

వెలిగించాలి నిత్యం ఆనంద దీపావళి!

కళ్ళలో కోటికాంతులతో

సదా ఉత్సాహ ఉల్లాసాలతో 

వెలిగించాలి ఆశాదీపాలు.

 శ్రిష్టి శేషగిరి