24-03-2025 01:12:18 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్ప డిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల వర్షపడింది. కామారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బల హీనపడంతో సోమవారం రాష్ట్రం లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రాబోయే రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గను న్నట్టు తెలిపింది. ఆదివారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42.8 మిల్లీటర్ల వర్షాపాతం నమోదైనట్టు తెలిపింది. హైదరాబాద్‌లో మరో 24 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.