హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఉత్తర, వాయువ్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు ఉదయం వేళల్లో మంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఆకాశం పాక్షి కంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. తేలికపాటి వర్షాల నేపథ్యం లో ప్రభుత్వం ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఆదివారం రాష్ట్రంలో ఖమ్మంలో అత్యధి కంగా 35.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.