హైదరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. గాలులు పశ్చిమ, వాయవ్య దిశల గుండా తెలంగాణ వైపు వీస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి స్వల్పంగా వర్ష సూ చనలు ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొంది. వచ్చే రెండురోజుల పాటు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ వివరిం చింది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెంలో 7.2 మిల్లీమీటర్లు, ములుగులో 5.2మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు ఐఎండీ వివరించింది.