calender_icon.png 14 January, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు తేలికపాటి వర్షాలు

07-12-2024 12:58:54 AM

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తూర్పు, అగ్నేయ దిశ మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. అయితే ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వారం రోజుల పాటు ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది.