calender_icon.png 23 December, 2024 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళల వెలుగు

28-10-2024 12:00:00 AM

టార్చి చేతిలో పట్టుకుని 

దారి చూపిస్తూ

నా ముందు నడిచిన వాళ్ళు

వెళ్ళిపోయారు

ఇంకొందరు జారిపోయారు

నాతో నాలుగు అడుగులు 

కలిసి నడిచిన వాళ్ళు

పెరిగిన వేడి ఒత్తిడికి

మాడు పగిలి పాదాలు మాడి

పక్క దారి వెతుక్కున్నారు

ఇంకొందరు కాటగల్సి పోయారు 

నేనేమో కమ్ముతున్న చీకట్లో

దారి తెలీక గతుకుల రోడ్డువెంట

తడబడుతూ తడుముకుంటా

‘కళ’ల వెలుగులో  

నన్ను నేను నిభాయించుకుంటున్నా

నత్తలా అయినా

నడుస్తూనే వున్నా.

- వారాల ఆనంద్