calender_icon.png 30 October, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షర జ్యోతి.. ఆశల జగతి

29-10-2024 12:00:00 AM

అక్షర జ్యోతి

ఆశల జగతి

విషయ కాంతి

విజయక్రాంతి


ప్రజల పక్షపాతి

ప్రబలమైన శక్తి

ప్రజలంటే భక్తి

విజయక్రాంతి


మాటల్లో నిజాయితీ 

మరువదెపుడు నీతి

బావుటా తానెత్తి

మట్టుబెట్ట అవినీతి 


సమభావపు సంకేతం

సంక్షేమం తన మతం

ప్రశ్నించే పాశుపతం

విప్లవించే ప్రజాగీతం


విశ్వాసమే రీతి

విషయమే సంపత్తి

విశ్లేషణకు క్రొవ్వొత్తి

విజయక్రాంతి


నిజమే నియతి

ఇజమే ప్రగతి

ధ్యేయమే జాగృతి

విజయక్రాంతి


కళలకు హంసగీతి

కవితల తేటగీతి

అందరికీ ఎంతో ప్రీతి

విజయక్రాంతి


నినదించే యువగళం

విస్తరించు భావజాలం 

సంఘానికి బలం బలం

విజయక్రాంతి


క్రీడలకు మైదానం

సినిమాల వినోదం

వనితలా ఆభరణం

యువతలా కేతనం


ఎంతెంతో ఘనకీర్తి 

మన దేశఖ్యాతి 

చాటే ఎలుగెత్తి

విజయక్రాంతి


మనత్రోవకు కాంతి

తొలగించును భ్రాంతి 

కోరేది సమాజ శాంతి

విజయక్రాంతి.