calender_icon.png 20 October, 2024 | 2:05 PM

ఎల్ఎండి గేట్ల ఎత్తివేత

20-10-2024 11:01:46 AM

దిగువ ప్రాంతంలో అప్రమత్తం చేసిన అధికారులు 

మిడ్ మానేర్ నుంచి ఇన్ఫ్లో రావడంతో దిగువకు నీటి విడుదల

మానకొండూర్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్ఎండి రిజర్వాయర్ కు మిడ్ మానేర్, ఎగువ కాలువ నుంచి ఇన్ఫ్లో వస్తుండడంతో ఆదివారం 2 గేట్లను ఎత్తి ఎస్సారెస్పీ అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. గత 2 రోజులుగా ఎగువ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో మిడ్ మానేరు రిజర్వాయర్ లోకి నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి ఎల్ఎండి రిజర్వాయర్ కు సుమారు 4300 క్యూసెక్కుల నీరు, ఎస్సారెస్పీ ఎగువ కాలువ ద్వారా 500 క్యూసిక్కుల 4800 క్యూసెక్కుల నీరు ఎల్ఎండి రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ లోకి 24 టీఎంసీలకు నిండుగా చేరుకుంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రెండు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నెల 6న 2గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో మళ్లీ నాలుగోసారి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎల్ఎండి రిజర్వాయర్ నీటిమట్టం 24.34 టీఎంసీలకు గాను 24.34 టీఎంసీల నీరు ఉంది. ఈ సందర్భంగా ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగితే గేట్ల ద్వారా నీటిని నీరంతరంగా కొనసాగిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.