calender_icon.png 26 December, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీపూర్ రిజరాయర్ గేట్లు ఎత్తివేత

04-11-2024 02:18:32 AM

ఆదిలాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ రిజరాయర్ కెనాల్ దారా రైతులకు  ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ అన్నారు. రిజరాయర్ సమస్యలను పరిష్కరించాలని అదిలాబాద్ యూ త్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదరి సామ రూపేశ్‌రెడ్డి ఇటీవల వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో ఆదివారం రిజరాయ ర్‌ను డీఈ పరిశీలించి సమస్యలపై అరా తీశారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కెనాల్‌లో ఎక్కడెక్కడ పూడిక తీయాల్సి ఉందో  రైతులతో డీఈ మాట్లాడా రు. ఆయన వెంట ఇరిగేషన్ ఏఈ,  కాంగ్రెస్ లీడర్ నాగరాజు, కిరణ్   ఉన్నారు.