10-03-2025 08:54:11 AM
హైదరాబాద్: అంబర్‌పేటలోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో(Unison International School Amberpet) లిఫ్ట్ ప్రమాదం సంభవించింది. లిఫ్ట్ లో ఉన్న 13 మందిలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్కూల్ లోని మొదటి అంతస్తు నుంచి వైర్ తెగి లిఫ్ట్ కిందపడింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై స్కూల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గాయపడిన విద్యార్థులు కొలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.