calender_icon.png 19 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవనశైలిలో మార్పులే కాలేయ వ్యాధులకు కారణం

19-04-2025 12:16:49 AM

కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ రావుల ఫణికృష్ణ

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): జీవనశైలిలో మార్పులే కాలేయ వ్యాధులకు ప్రధాన కారణమవుతాయని కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, జీఐ, హెచ్‌పిబి ఆంకాలజిస్టు, బేరియాట్రిక్, మెటబాలిక్, రోబోటిక్ సర్జన్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రావుల ఫణికృష్ణ తెలిపారు.

శుక్రవారం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా కాలేయ రక్షణ కోసం పలు విషయలు చెప్పారు. మదపానం తీసుకోవద్దని, అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్, పంచదార, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని తెలిపారు. కదలికలేని జీవనశైలి కారణంగా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. దీని ఫలితంగా ఫ్యాటీ లివర్, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తాయి.

మద్యం పానాన్ని మానుకోవడం, సురక్షిత లైంగిక సంబంధాలు, డ్రగ్స్ మానివేయడం  వంటి జీవనశైలిలో మార్పులు వల్ల లివర్ను రక్షించుకోవచ్చన్నారు. లివర్ వ్యాధుల ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవని, లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ముదిరిపోతుందన్నారు. కాబట్టి ముందుగానే పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలిలో మార్పులు చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు.