calender_icon.png 23 February, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి జీవిత విశేషాలు

20-02-2025 12:00:00 AM

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నారు దిగ్గజ దర్శకుడు దివంగత కే విశ్వనాథ్. కళలకు, విలువలకు పెద్దపీట వేసి గొప్ప చిత్రాలను రూపొందించిన ఆయన భౌతికంగా లేకపోయినా, తన సినిమాల రూపంలో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు.

ఇప్పుడు ఆయన జీవితాన్ని తెరపై చూపనున్నారు. జనార్దన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో విశ్వనాథ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆయనతో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.

బుధ వారం విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక మేకర్స్ ఆయన బయోపిక్ ప్రోమోను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఇది రిలీజ్ కానున్నట్టు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.