calender_icon.png 22 October, 2024 | 6:09 AM

గిగ్ వర్కర్లకు జీవిత భద్రత

18-10-2024 01:18:32 AM

కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కోసం తీసుకురానున్న కొత్త పథకానికి సంబంధించిన బిల్లు రూపకల్పన జరుగుతున్నదని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 65 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసిందని తెలిపారు. వీరందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించేందుకు చట్టం తెస్తామని చెప్పారు. స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ ఏజెంట్లు, క్యాబ్ డ్రైవర్లు తదితర ఉద్యోగులను గిగ్ వర్కర్లు అని పిలుస్తున్నారు. వీరితోపాటు ప్లాట్‌ఫాం వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పిస్తామని వెల్లడించారు.