calender_icon.png 25 February, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైఫ్ సైన్సెస్ లో సాధించిన ప్రగతి... రాష్ట్రానికి గొప్ప పేరు

25-02-2025 03:35:06 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లైఫ్ సైన్సెస్ రంగం(Life Sciences Sector)లో తెలంగాణ పెరుగుదల రాత్రికి రాత్రే సాధించిన విజయం కాదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Industries Minister Sridhar Babu) పేర్కొన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ వర్సిటీ(Life Sciences University) ఏర్పాటు చేస్తామని, ప్రపంచస్థాయి నిపుణులను తయారు చేసే కోర్సులకు రూపకల్పన చేశామని మంత్రి చెప్పారు. బయో ఆసియా 2025(Bio Asia 2025) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ లో సాధించిన ప్రగతి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిందని శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు.  లైఫ్ సైన్సెస్ లో నంబర్ వన్ అవ్వాలంటే జినోమ్ వ్యాలీ పాత్ర కీలకమని, దానిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రత్యేక్షంగా 51 వేల మందికి, పరోక్షంగా లక్షన్నర వేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుతోనే ఆగిపోం.. వారితో కలిసి పనిచేస్తామని  వర్సిటీలు, స్టార్టప్ లు, పరిశోధన సంస్థలతో భాగస్వాములు అవుతామని మంత్రి స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి లైఫ్ సైన్సెస్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే జనరిక్ మందుల్లో రాష్ట్ర వాటా 20 శాతం, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో వాటా 40 శాతమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పురోగతికి ఒక దీపస్తంభంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు సమయం ఆసన్నమైందని, భవిష్యత్తు అపరిమితంగా ఉన్న ప్రదేశం తెలంగాణ అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.