calender_icon.png 26 March, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగారకుడిపై జీవం?

26-03-2025 01:06:57 AM

అద్భుతాన్ని ఆవిష్కరించిన క్యూరియాసిటీ రోవర్

న్యూఢిల్లీ, మార్చి 25: నాసాకు చెందిన ‘క్యూరియాసిటీ’ రోవర్ అంగారక గ్రహం మీద పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఎంతో విలువైన సమాచారం సేకరించిన ఈ రోవర్ తాజాగా సేకరిం చిన కొన్ని నమూనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి. ఈ రోవర్ అంగారక గ్రహం మీద అతిపెద్ద సేంద్రియ నిల్వలను గుర్తించింది. దీంతో ఆ గ్రహం మీద జీవరాశి మనుగడ సాగిందా? అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

ఈ రోవర్ ఎల్లో నైఫ్ బే అనే ప్రాం తంలో సుమారు 3.7 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి రాతి నమూనాలను గుర్తించింది. వాటిలో కొన్ని సమ్మేళనాలు లభించాయి. ఈ సమ్మేళనాలలో డికేన్, అన్‌డికేన్, డొడికేన్ వంటివి ఉన్నట్టు విశ్లేషణలో తేలింది. ఇవి ఆల్కేన్లు. కార్బన్స్, హైడ్రోజన్‌తో ఉన్న సంతృప్త హైడ్రోకార్బన్లు.  

కొవ్వు ఆమ్లాల శకలాలు! 

అంగారక గ్రహం మీద లభించిన సమ్మేళనాలు కొవ్వు ఆమ్లాల శకలాలు అయి ఉం టాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూ మ్మీద రసాయన సమ్మేళనాలలో కొవ్వు ఆ మ్లాలు ఉంటాయి. ఈ మూలకాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలకు కష్టం అయింది. కా నీ కొన్ని కారణాల వల్ల క్యూరియాసిటీ శాస్త్రవేత్తల బృందం దీన్ని ఛేదించారు.

‘మా పరి శోధనలు ఈ గ్రహం మీద రసాయనిక స మ్మేళనాలు ఉన్నాయన్న విషయం నిర్దారించాయి’. అని శాస్త్రవేత్తల బృందానికి నాయ కత్వం వహిస్తున్న కరోలైన్ తెలిపారు. క్యూరియాసిటీ శాస్త్రవేత్తలు గతంలో కూడా అంగా రకుడి మీద చిన్న పాటి సేంద్రియ సమ్మేళనాలను కనుగొన్నారు. పెద్దఎత్తున లభించిన సమ్మేళనాల ద్వారా ఈ గ్ర హం మీద జీవం ఉందనే ఆధారాలు లభించాయి. 

2013లోనే.. 

క్యూరియాసిటీ రోవర్ 2013 మేలో అంగారక గ్రహం మీద ‘ఎల్లో నైఫ్ బే’ అనే ప్రాంతంలో డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. పురాతన సరస్సులా కనిపించే ఎల్లో నైఫ్ బేను చూసి శాస్త్రవేత్తలు అబ్బురపడ్డారు. అందుకోసమే ఆ ప్రాంతంలో పరిశోధనలు మరింత ముమ్మరం చేశారు. సీనియర్ శాస్త్రవేత్త డేనియల్ గ్లావేన్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఎన్నో మిలియన్ సంవత్సరాలుగా నీరు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జీవరాశి బతికే అవకాశం ఉంది.’ అని పేర్కొన్నారు.