calender_icon.png 13 April, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలిక్కడ చీప్!

13-04-2025 01:15:16 AM

తాగు మామా తాగు-2

మొత్తం మద్యం విక్రయాల్లో చీప్ లిక్కర్‌దే అగ్రస్థానం

  1. ధర తక్కువ.. కిక్కు ఎక్కువ 
  2. పేద, మధ్యతరగతి ప్రజలు బలి

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): చీప్ లిక్కర్.. మద్యపానంలో మను షుల ప్రాణాలు తీసే మహమ్మారి ఇది. ఒళ్లుగుల్లచేసి ఇంటిని నరకం చేస్తున్న పెనుభూ తం ఇది. ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న చీప్ లిక్కర్‌తో ఎన్నో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. మద్యం విక్రయాల్లో  చీప్ లిక్కర్ దే అగ్రస్థానం.

మద్యం అమ్మకాల్లో చీప్ లిక్క ర్ అమ్మకాలే 70 శాతం వరకు ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నా రు. ఎక్కువ ధర కలిగిన కంపెనీల మద్యాన్ని ఎగువ మధ్యతరగతి ప్రజలు వినియోగిస్తుంటే, పేద వర్గాల ప్రజలు, కార్మికులు, రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు, తండావాసులు, గూడాల్లోనివారు తక్కువ ధరకు లభించే చీప్‌లిక్కర్‌నే ఎక్కువగా  సేవిస్తున్నారు.

చీప్ లిక్కర్‌కు తక్కువ ధర ఉండటం ఇందుకు కారణం అన్ని మద్యం బ్రాండ్లలో ఆల్కహాల్ శాతం 48 శాతమే ఉంటుందని బాటిల్స్‌పై ముద్రించినప్పటికి.. తక్కువ ధర మద్యంలో ఆల్కహాల్ ఎక్కువగా కలుపుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చీప్ లిక్కర్‌లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండ టం వల్ల.. శరీరమంతా మత్తుగా మారుతోందని చెబుతున్నారు.

కేఏఐ లాంటి చీప్ లిక్కర్‌కు సంబంధించిన ఒక క్వార్టర్ కేవలం రూ. 110కు దొరుకుతుంది. ఇందులో ఆల్కహాల్ శాతం 60 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆఫీసర్ చాయిస్, ఇంపీరి యల్ బ్లూ, ఎంసీ,  ఒరిజనల్ ఛాయిస్, ఏసీ ప్రీమియం, ఐకాన్, రాయల్‌స్టాగ్, రాయల్ ఛాలెంజ్ లాంటి మద్యం ఒక క్వార్టర్  ధర రూ. 180 పైమాటే. 

మత్తుకు యువత బానిస 

గతంలో మద్యం సేవించే వారిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉండేవారు. ఇప్పుడు మాత్రం నూనూగు మీసాల ప్రా యంలోనే యువత మద్యానికి అలవాటుపడుతోంది. ఇది మరో ప్రమాదకర పరిణామమని, యుక్త వయసు వచ్చే నాటికి మద్యానికి బానిసలుగా మారుతుండటంతో ఎందు కు కొరగాకుండా పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సగటున 36.2 శాతం మంది పురుషులు ప్రతిరోజూ మద్యం సేవిస్తున్నారు. 15 నుంచి 49 ఏళ్ల వయసు కలిగిన వారి సంఖ్యే ఇందులో ఎక్కువని గతంలో నిర్వహించిన జాతీయ కుటుం బ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడైంది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా, 1,171 వరకు బార్లతో పాటు క్లబ్బులు ఉన్నాయి.

ఇప్పుడు అదనంగా మరో 40 బార్లను పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.   అంతే కాకుండా రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా, ఒక్కో గ్రామం లో అనధికారికంగా 5 నుంచి 10 వరకు బెల్ట్‌షాపులున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా లక్షకు పైగా బెల్ట్‌షాపులు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. వీటన్నింటిలో నూ చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.