calender_icon.png 24 November, 2024 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో జీవితఖైదు

23-10-2024 12:05:34 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 22 : మైనర్‌పై లైంగికదాడి కేసులో నిందితుడికి ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవితఖైదు విధించింది. వివరాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడి పల్లికి చెందిన మహ్మద్ ఖాజా(43) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఖాజా మొదటి భార్య చనిపోవడంతో.. అతడు మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో 2023లో ఆ మహిళ.. కూతురి(మైనర్)ని ఖాజా లైంగికంగా వేధించాడు. తాను ఉంటు న్న ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలు జరిగిన విషయంపై తాను చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పింది. ఉపాధ్యాయుల ఫిర్యాదు తో అదే ఏడాది అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.

పోలీసులు కేసు దర్యాప్తు చేసి.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి హరీశ.. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.30వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.12లక్షల పరిహారం అందజేసింది.