calender_icon.png 13 February, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో జీవిత ఖైదు

13-02-2025 02:16:26 AM

కరీంనగర్, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): కూతురు ఉన్న మహిళను రెండో పెళ్లి చేసు కొని కుటుంబ కలహాల వల్ల తల్లి కూతుర్లను హత్య చేసిన నేరంలో నిందితుడు కొక్కిస వెంకటేష్ (55) కు జీవిత ఖైదు తో పాటు 2500 రూపాయల జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా జడ్జి బి ప్రతిమ బుధవారం తీర్పునిచ్చారు.

ప్రా సిక్యూషన్ కథనం ప్రకా రం మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన కొక్కిస వెంకటేష్ అలియాస్ వెంక న్న బతుకుదెరువుపై హుజురాబాద్ కు వచ్చి జీవిస్తున్నాడు.ఇతని మొదటి భార్య గత 30 సంవత్సరాల క్రితం  విడాకులు తీసుకొని వె ళ్ళిపోయింది. అనంతరం రమ అనే మహిళ కు కూతురు ఉండగా ఆమెను రెండో వివా హం చేసుకొని ఆటో నడుపుకుంటూ స్థానిక ప్రతాపవాడలో నివాసం ఉంటున్నాడు.

చాలా రోజులుగా భార్య కూతురుతో ఇతనికి ఆర్థిక విషయాల్లో గొడవలు జరుగుతుండేవి, దాంతోపాటు భార్య కూతురుపై అక్రమ సం బంధంపై అనుమానం పెంచుకున్నాడు. దీని లో భాగంగా 2021జనవరి 21 నా రాత్రి భార్య రమ కూతురు ఆమనీ (24) లు పడు కొని ఉండగా పథకం ప్రకారం ఇనుప పైపు తో ఇద్దరి తలల పై తీవ్రంగా గాయపరచి చంపాడు.

ఈ సంఘటనపై హూజురాబాద్ పోలీసులు వెంకటేష్ పై కేసు నమోదు చేయగా ఏసీపి కే వెంకట్ రెడ్డి దర్యాప్తు జరి పారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరి శ్రీరాములు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్షాధా రాలు పరిశీలించిన జడ్జి నిందితుడు వెంకటే ష్‌కు జీవిత ఖైదుతో పాటు 2500 రూపా యల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.