నిర్మల్, నవంబర్ 4 (విజయక్రాంతి): తనకు పెండ్లి చేయడం లేదని కన్న తండ్రినే చంపిన కుమారుడికి జీవిత ఖైదు విధిస్తూ నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి కర్ణకుమార్ సోమవారం తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టణంలోని పింజరి గుట్ట కు చెందిన అప్పాల గణపతికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికి తండ్రి పెండ్లి చేయగా చిన్న కొడుకు అభిలా ష్ ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అయి నా వినని అభిలాష్ తనకు తనకు పెం డ్లి చేయాలని తల్లి దండ్రులను ఇబ్బం ది పెట్టెవాడు. ఏదైనా పని చేసుకుంటే నే పెండ్లి చేస్తామని చెప్పడంతో అభిలాష్ తండ్రిపై కక్ష పెంచుకుని 2022 జూన్ 13న తండ్రిని కత్తితో దాడి చేసి చంపాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేశారు. సోమవా రం న్యాయమూర్తి కర్ణకుమార్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.