తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన సందర్భం గా రాష్ట్రంలో విద్యారంగంలో మార్పులను పరిశీలిస్తే అనేక మార్పులు జరిగాయి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు గురైన విద్య, వైద్య రంగాలకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో ఎన్నో సంవత్సరా లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపా ధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేశా రు.
దాదాపు పదివేలకు పైగా కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నియమించారు. ప్రభుత్వ, పంచాయ తీ రాజ్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యులను, విద్యా కమిషన్ ఛైర్మన్‌ను, సభ్యులను నియమించి విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు.
రాష్ట్రంలో విద్యా శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠ శాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చినప్పుడు, కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు, నవంబర్ 14న బాలల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ముఖ్య మంత్రి స్వయంగా ఉపాధ్యాయులను కలిసి దశ, దిశా నిర్దేశం చేశారు. నాణ్యమైన విద్యను ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యార్థులకు అందించాలని మార్గనిర్దేశం చేశారు.
శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులేరి ?
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరా జ్ పాఠశాలల్లో పనిచేయడానికి నియమిం చే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డీఎడ్, బీఎడ్ పూర్తి చేసి ఉండాలి. రాష్ట్రంలోని అన్ని డీఎడ్, బీఎడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఉపన్యాసకుల, ఆచార్యుల పోస్టులను గత దశాబ్ద కాలంగా భర్తీ చేయడం లేదు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను, ఉపన్యాసకులను డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో నియమించి విద్యా సంవత్సరం పూర్తి చేస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించి వారికి చిన్నప్పటి నుండి నాణ్యమైన విద్య ను అందిస్తే పెద్ద చదువులు చదవడానికి సులభం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని డైట్ కళాశాలల్లో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్క డైట్ కళాశాల లెక్చరర్‌కూడా లేక పోవడంతో జిల్లా విద్యాశాఖాధికారిణికి ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజామా బాద్ నుండి డిప్యూటేషన్ మీద వచ్చిన ఎస్సీ ఆర్ట్ ఈ ప్రొఫెసర్‌ను డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు.
అన్ని పోస్టు లు ఖాళీగా ఉంటే డిప్యూటేషన్ మీద నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డీఎడ్ ప్రథమ సంవత్సరం పూర్తి అయి పరీక్షల తేదీలు వచ్చినప్పటికీ ఛాత్రోపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయులు లేరు. పాఠాలు కాకుండా శిక్షణ కళాశాలల్లో శిక్షణ లేకుండానే పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏ విధమైన ఉపాధ్యాయులను తయారు చేయవచ్చో మనం ఊహించవచ్చు.
2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొత్త ఉపాధ్యాయులలో కొంత మంది ఒక్కరోజు కూడా శిక్షణ కళాశాలలకు వెళ్ళకుండా శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ తీసుకొని వస్తే విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి శిక్షణ తీసుకోని ఛాత్రోపాధ్యాయు లకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపివేశారు. రాష్ట్రంలో విద్యా శాఖకు లక్షలకు లక్షలు నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం అసలు సిసలైన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుం డా నాణ్యమైన విద్యను ఏ విధంగా అందిస్తుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , మేధావులు, విద్యార్థి, యువజన, ఉపాధ్యా య సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెట్ ఫీజు తగ్గింపు
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో నియమించడానికి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు.ఉపాధ్యాయ నోటిఫికేషన్‌కు ముం దు అర్హత పరీక్ష ‘టెట్’ను నిర్వహిస్తారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు సార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన ఛాత్రోపా ధ్యాయులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫస్ట్ పేపర్‌కు వెయ్యి రూపాయలు, రెండు పేపర్లు రాస్తే రెండు వేల రూపాయల ఫీజు వసూలు చేసేవారు.
ఈ ఫీజు ఒకేసారి ఉపయోగపడేది. రేవంత్ సర్కార్ టెట్ పరీక్ష ఫీజును వెయ్యి రూపాయల నుండి 750 రూపాయలు చేసింది. రెండు పేపర్లకు 1500 రూపాయల ఫీజు నిర్ణయించింది. రెండవ సారి టెట్ పరీక్ష రాసి మార్కులను పెంచుకోవాలనుకునేవారికి, మొదటి సారి ఏదైనా అని వార్య కారణాల వల్ల పరీక్ష రాయని వారు రెండో సారి టెట్ పరీక్ష రాయాలనుకుంటే పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వ డం చారిత్రాత్మక నిర్ణయం అని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కార్ విద్యా శాఖలో విప్లవాత్మకమైన మార్పు లు తేవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవిద్యార్థులకు అందరికీ కలిపి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను స్వంత భవనాలలో నిర్మిం చి నాణ్యమైన విద్యను అందించనున్నారు.
తగ్గుతూ వచ్చిన బడ్జెట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గత ప్రభు త్వంలో విద్యా రంగంలో ఊహించినంత మార్పులు జరగలేదు. 2014 జూన్ తర్వా త విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్ తగ్గుతూ వచ్చింది. అనేక వేల మంది ఉపాధ్యాయ శిక్షణలైన డీఎడ్, బీఎడ్ పూర్తి చేసుకొని డీఎస్సీ, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే 10 వేల మందికి పైగా టీచర్లను భర్తీ చేసింది.
పదోన్నతులు, బదిలీల సమస్య
ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులు లేక ఒకే పాఠశాలలో 12,13 సంవత్సరాల నుండి పనిచేశారు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తు న్న ఉపాధ్యాయులూ గడిచినా బదిలీలు, పదోన్నతులు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మార్చారు. పరిపాలన సౌల భ్యం కోసం 317 జీవో ద్వారా జూనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు కేటాయించడం జరిగింది.
317 జీవో వలన కుటుంబ సభ్యులకు దూరమయ్యామని, స్థానికులుగా ఉన్నా స్థానికేతరులుగా మారాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్‌రెడ్డికి తుది నివేదిక కూడా సమర్పించింది. జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త సర్కార్ త్వరలో తీపి కబురు చెప్తుందని స్వయంగా సీఎం, మంత్రులు అనేక సమావేశాలలో ప్రకటిస్తుండడంతో వారంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా విధానంలో అనేక మార్పులు చేర్పులు జరిగా యి. ఒకటో తరగతి నుండి డిగ్రీ, పీజీ పుస్తకాలను మార్చడం జరిగింది తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, తెలంగాణ కళలకు, తెలంగాణ కవులు, రచయితలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాసన సభ, శాసన మండలి సభ్యులుగా అవకాశం వచ్చింది. నామినేటెడ్ పదవులు దక్కాయి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా, సభ్యులుగా, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా, వివి ధ విశ్వవిద్యాలయాలలో ఉపకులపతులు గా తెలంగాణ వారికి అవకాశాలు దక్కా యి. తెలంగాణలో రేవం త్ సర్కార్ వచ్చిన తర్వాత అన్ని విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం.అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట నిధులను మంజూరు చేసి ప్రభుత్వ, పం చాయతీ రాజ్ పాఠశాలల్లో మరమ్మతులు చేశారు.
కనీస సౌకర్యాలైన మంచి నీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, కంప్యూటర్లను మంజూరు చేసి డిజిటల్ బోధన చేయడం, ఆంగ్ల మాధ్యమం లో విద్యాబోధనతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతు న్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ బడులు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
- డా. ఎస్. విజయ భాస్కర్