calender_icon.png 8 October, 2024 | 5:59 PM

Breaking News

చావులపై అబద్ధాలా!

04-09-2024 01:33:59 AM

  1. రేవంత్ సర్కార్‌ను ఎవరూ క్షమించరు
  2. వరదలకు 31 మంది చనిపోయారు
  3. జాబితా వెల్లడించిన కేటీఆర్  

హైదరాబాద్ సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరదలకు చనిపోయిన వారిపై అబద్దాలు చెప్పే రేవంత్ సర్కార్‌ను ఎవరూ క్షమించరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలకు తెరదించి ఆ కుటుంబాలను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 25 లక్షలు అందించాలని సూచిం చారు. ఈ సందర్భంగా మృతి చెందిన 31 మంది వివరాలు వెల్లడించారు. 

మృతుల వివరాలు..

 సూర్యాపేట జిల్లాలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లాలో నర్సయ్య, నాగభూషణం, ములుగు జిల్లాలో జెర్రిపోతుల మల్లికార్జున్, పుట్ట మహేశ్, వరంగల్ జిల్లాలో కోండ్ర సమ్మక్క, హనుమకొండ జిల్లాలో  గువ్వరాములు, నిర్మల్ జిల్లాలో కందం భోజారాం, నారాయణపేట్ జిల్లాలో హన్మమ్మ, అంజిలమ్మ, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు, వనపర్తి జిల్లాలో వడ్డే చంద్రయ్య చనిపోయారన్నారు.

పెద్దపల్లిలో జిల్లాలో చెప్యాల పవన్, గోస్కుల కుమార్, కామారెడ్డి జిల్లాలో కైరంకొండ శివరాములు, సిద్దిపేట జిల్లాలో లక్ష్మన్, బొబ్బల కనకారెడ్డి, ఖమ్మం జిల్లాలో  యాకూబ్, సైదాబా, సాంబశివరావు, పద్మావతి, సునావత్ అశ్వని, సునావత్ మోతీ లాల్, కొత్తగూడెంలో నందికొళ్ల రాము, తాటి అదమ్మ, కల్లూరి నీలమయ్య, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, రంగారెడ్డి జిల్లాలో ఎరుకల రాజేశ్, ఆరిఫ్ మన్సూర్ మృతి చెందారని ఆయన తెలిపారు.