calender_icon.png 19 January, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ రక్తంలోనే అబద్ధం ఉంది

17-12-2024 01:45:18 AM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

నిర్మల చర్యలు బాగా లేవు..

ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే

వాడీవేడిగా ఉభయసభలు

లోక్‌సభలో కేంద్రంపై ప్రియాంక ఫైర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజ్యసభ దద్దరిల్లింది. సోమవారం రాజ్యాంగంపై చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తూ  కాంగ్రె స్ పార్టీ, నెహ్రూపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కాకుం డా తన నాయకత్వం, కుటుంబాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పదేపదే రాజ్యాం గాన్ని  మార్చివేసిందని ధ్వజమెత్తారు. పౌర హక్కులను పరిమితం చేయాడానికే రాజ్యాంగాన్ని సవరించారని ఆరోపించారు.

1951లో నెహ్రూ హయాంలోనే మొదటి సవరణ చేసి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టారని గుర్తు  చేశారు. పదవి కోల్పోతా మనే భయంతోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో 39వ రాజ్యాంగ సవరణను ఆమోదించారని అన్నారు. 42వ రాజ్యాంగ సవరణగురించి ఆమె ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 50 దేశా లు స్వాతంత్య్రం పొంది రాజ్యాంగాన్ని రచించుకున్నాయన్నారు.

అయితే పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పు లు చేసుకున్నా.. భారత రాజ్యాంగం మాత్రం  కాల పరీక్షను తట్టుకుని నిలబడిందన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ సవరణలు చేసి.. ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి మా ట్లాడుతోందని నిర్మల అన్నారు.  కాంగ్రెస్ రక్తంలోనే అబద్దం ఉంది. వారు ప్రధాని మోదీని దొంగ అని పిలవడమే కాదు తన ను కూడా అబద్దాల కోరు అని పిలుస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని నిలిపివేయాలని ఇందిర ప్రయత్నించారని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

నిర్మల చర్యలు బాగా లేవు: ఖర్గే

కేంద్రమంత్రి నిర్మల చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల జేఎన్‌యూ పట్టభద్రురాలు, ఆర్థిక నిపుణురాలు కావచ్చని, అయితే అమె చర్యలు మాత్రం బాగా లేవంటూ హితవు పలికారు. బీజేపీ విభజన సూత్రాన్ని నమ్ముతుందని, కానీ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కావాలన్నారు. బీజేపీ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. నెహ్రూ, ఇందిరలను బీజేపీ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం బీజేపీ ఏనాడు పోరాటం చేయలేదని, అలాంటి వారు నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగా నికి బీజేపీ అనుకూలమా లేదా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక సమస్యల పరిష్కారంపై బీజేపీకి ఆసక్తి లేదన్నారు. జాతీయ జెండా, రాజ్యాంగాన్ని ఎన్నడూ గౌరవించని వారు ఇప్పుడు తమ కు రాజ్యాంగంపై పాఠాలు చెబుతున్నారని విమర్శించారు. గోబెల్స్ కంటే కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రె స్ తెచ్చిన ఆహార భద్రతా చట్టం కరోనా టైంలో పేదలను ఆదుకుందన్నారు. రాజ్యాంగం బలోపేతానికి మోదీ  చర్యలు ఏం తీసుకున్నారు, ఏం సాధించామో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.  మనుస్మృతి ఆధారంగా లేద ని రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించిదన్నారు. 2002జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్ తొలిసారి తమ హెడ్ క్వార్టర్‌లో జాతీయ జెండాను ఎగుర వేసిందన్నారు.

రాజ్యాంగాన్ని, జాతీయజెండాను ద్వేషించేవాళ్లు నేడు రాజ్యాంగంపై పాఠాలు చెబుతున్నారని విమర్శించారు. 1971లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన డిసెంబర్ 16ను విజయ్ దివస్‌గా జరు పుకుంటున్నామని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలను ఆదుకోవడంలో నాటి ఇందిరను బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఖర్గే సూచించారు.

మోదీ అబద్ధ్దాల కోరు..

రాజ్యాంగంపై మోదీ అవాస్తవాలు చెబుతున్నారని ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగం బలోపేతానికి గత 11 ఏళ్లలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. అబద్దాలతో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.   

నెహ్రూ, ఎడ్వినా లేఖల్లో ఏముంది?

నెహ్రూ లేఖలపై రాహుల్‌కు పీఎంఎంఎల్ మరోసారి లేఖ రాయండంతో అసలు ఆ లేఖలో  ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ సతీమణి ఎడ్విన్ మౌంట్ బాటెన్‌కు మొదటి ప్రధాని నెహ్రూ పలు లెటర్లు రాశారు. దాదాపు 80 ఏండ్ల తరువాత కూడా వారు రాజకీయ చర్చల్లోకి ఎందుకు తిరిగి వస్తున్నారో చూద్దాం. 1947లో భారత్‌లో అడుగుపెట్టిన ఎడ్విన్.. నెహ్రూతో ఎంతో సఖ్యతగా ఉండేవారని, వారి మధ్య జరిగిన లేఖలను చదివిన తరువాత  ఎడ్విన్ కుమార్తె, మౌంట్ బాటెన్ కుటుంబసభ్యులు, పమే లా హిక్స్ తెలిపారు.

ఈ మేరకు పమేలా ‘డాటర్ ఆఫ్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్’ అనే పుస్తకంలో నెహ్రూ, ఎడ్విన్ ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో, గౌరవించుకున్నారో కనిపిం చిందని పేర్కొన్నారు. ఆమె కోరుకున్న ఆత్మ, తెలివి, సాహచర్యం, సమానత్వం నెహ్రూలో ఆమెకు కనిపించాయని వివరించింది. వారు చాలా అరుదుగా ఒంటరిగా ఉండేవారని పేర్కొన్నారు. దేశాన్ని వీడుతున్న సమయంలో ఆమెపై నెహ్రూ ప్రశం సల వర్షం కురింపించారు. భారతదేశంలోని ప్రజలు మిమ్ములను ప్రేమిస్తూ తమ లో ఒకరిగా చూసుకున్నారని, మీరు మీ దేశానికి వెళుతున్నందుకు ఇక్కడివారు బాధపడడంలో ఆశ్చరం ఏమీ లేదన్నారు.

భారత్ గళం విప్పాలి: ప్రియాంక

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తన గళం వినిపించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కోరారు. సోమవారం లోక్‌సభలో బంగ్లాలో మైనార్టీల దాడులపై ఆమె మాట్లాడుతూ ఆ దేశంతో మాట్లాడి  పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో అమరులైన వారికి ఆమె సెల్యూట్ చేశారు. నాటి తూర్పు పాకిస్థాన్‌లో పరిస్థితిని ఇందిర ధైర్యంగా చక్కదిద్దారని కొనియాడారు. 

నెహ్రూ లేఖలను అప్పగించండి..

2008లో తమ వద్ద సోనియాగాంధీ తీసుకున్న మాజీ ప్రధాని జవహార్ లాల్‌నెహ్రూ లేఖలను తిరిగి తమకు అప్పగించాలని రాహుల్‌గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్) లేఖ రాసింది. ఎడ్వినా మౌంట్ బాటెన్, ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ, విజయలక్ష్మీ పండిట్ అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్ రామ్, జీబీ పంత్ తదితరులతో నెహ్రూకు మధ్య జరిగిన లేఖలు వాటిలో ఉన్నాయి.

జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో  లైబ్రరీని కేంద్రం  నిర్వహిస్తోంది.  ఈ క్రమంలో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన నెహ్రూ లేఖలను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి నెహ్రూ మెమోరియల్ అప్పగించింది. అయితే 2008లో 512 బాక్సుల్లో వాటిని ప్యాక్  చేసి సోనియాగాంధీకి పంపా రు. అప్పటినుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబర్‌లోనే పీఎంఎంఎల్ కోరింది.

ఈక్రమంలో డిసెంబర్ 1ంన రాహుల్‌కు మరోసారి విజ్ఞప్తి చేసింది. కనీసం వాటి జిరాక్స్ కాపీలు, లేదా డిజిటల్ కాపీలను అయినా ఇవ్వాలని కోరింది. అయితే సోనియా ఆదేశాల మేరకే ఆ లేఖలను లైబ్రరీ నుంచి తీసివేశారని బీజేపీ ఆరోపించింది. ఎడ్వినా మౌంట్‌బాటెన్ , నెహ్రూలు పరస్పరం రాసుకున్న లేఖలు సోనియ వద్ద ఉన్నాయని, వాటిని తీసుకురావడం లో రాహుల్ సహాయం చేయాలని బీజేపీ కోరింది. చారిత్రక వారసత్వం కల్గిన లేఖలు ఏ కుటుంబానికో చెంది న ఆస్తి కాదని, ఆ లేఖలలో ఏముందో తెలుసుకోవాలనే ఆస్తకి దేశంలో ఉందని పేర్కొన్నది.