calender_icon.png 25 October, 2024 | 4:49 AM

బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి

25-10-2024 12:05:22 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): దీపావళిని పురస్కరించుకొని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాల కు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసుకో వాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  ట్రేడ్ లైసెన్స్ ఫీజు రిటైల్ షాపులకు రూ.11 వేలు, హోల్‌సేల్ షాపులకు రూ.66 వేలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

ఈ దుకాణాల ఏర్పాటుకు నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్‌ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, www.ghmc.gov.in <http://www.ghmc.gov.in> వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గుర్తింపు రుజువుకు ఆధార్, పాన్‌కార్డులు జత చేయాలని సూచించారు.