హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ గురువారం పదవీ విరమణ పొందారు. శ్యాంసుందర్ ఎల్‌ఐసీలో తన 36 సంవత్సరాల కేరీర్‌లో దేశవ్యాప్తంగా వివిధ పదవులను నిర్వహించారు. అలాగే బహ్రెయిన్‌లో ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్ జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. ఆయన స్థానంలో నూతన జనరల్ మేనేజర్‌గా పుణీత్‌కుమార్ బాధ్యతలు చేపట్టినట్లు ఎల్‌ఐసీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పదవీ విరమణ పొందిన శ్యాంసుందర్‌కుకు నూతన జనరల్ మేనేజర్ పుణీత్‌కుమార్, ఎల్‌ఐసీ సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.