న్యూఢిల్లీ, ఆగస్టు 8: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కన్సాలిటేడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన క్యూ1లో 9 శాతం వృద్ధిచెంది రూ.10,544 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది. సంస్థ ప్రీమియం ఆదాయం రూ.6,811 కోట్ల నుంచి రూ.7,470 కోట్లకు చేరింది.