08-02-2025 12:33:06 AM
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ. 9,444 కోఓట్లతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
సమీక్షా త్రైమాసికంలో ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,06,891 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో ని రూ.1,17,017 కోట్ల తో పోలిస్తే ప్రీమియంల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం గమనార్హం. సంస్థ మొత్తంఆదాయం సైతం రూ. 2,12, 447 కోట్లనుంచి రూ. 2,01,994 కోట్లకు తగ్గినట్లు ఎల్‌ఐసీ తెలిపింది.