calender_icon.png 23 December, 2024 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఐసీ హౌసింగ్ లాభం 1,300 కోట్లు

03-08-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 2 శాతం తగ్గి రూ. 1,300 కోట్లుగా నమోదయ్యింది. నిరుడు ఇదేకాలంలో సంస్థ రూ. 1,324 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 6,747 కోట్ల నుంచి రూ. 6,784 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం స్వల్పంగా రూ. 6,703 కోట్ల నుంచి రూ. 6,739 కోట్లకు పెరిగింది.