మణిపాల్‌సిగ్నాలో వాటా కొనుగోలుకు చర్చలు
న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ దిశగా మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, యూఎస్‌కు చెందిన సిగ్నా కార్పొరేషన్‌ల మధ్య జాయింట్ వెంచర్ అయిన మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో బెంగళూరు కేంద్రంగా కార్యకలా పాలు నిర్వహిస్తున్న మణిపాల్ గ్రూప్‌నకు 51 శాతం వాటా, సిగ్నాకు మిగిలిన 49 శాతం వాటా ఉన్నది.
ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఎల్‌ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆ విభాగంలోకి ప్రవేశించాలన్న వ్యూహాన్ని ఇప్పటికే వెల్లడించింది. దాదాపు 50 శాతం వరకూ వాటాను తీసుకునేందుకు జరుగుతున్న చర్చలు ప్రస్తుతం ప్రాధ మికదశలో ఉన్నాయని, రెండు పార్టీలు ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రాధమిక చర్చల ప్రకారం ఎల్‌ఐసీకి వాటా విక్రయించడానికి మణిపాల్ గ్రూప్, సిగ్నాలు వాటి వాటాలను తగినరీతిలో తగ్గించుకుంటాయి. ఒప్పందం ఖరారైతే మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4,000 కోట్ల విలువ లభించవచ్చని అంచనా.