calender_icon.png 2 February, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక హంగులతో గ్రంథాలయం: కలెక్టర్ ప్రతీక్ జైన్

02-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి 1: ఆధునిక  హంగులతో నూతన గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పట్టణ కేంద్రంలోని జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వివిధ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడుతూ వారికి కావలసిన అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. యువత అభ్యర్థన మేరకు గ్రంధాలయంలో  అందుబాటులో ఉండే విధంగా రెండు కంప్యూటర్లను సమకూ రుస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రంధా లయంలో మౌలిక సదుపాయాల  కోసం కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.

గ్రంధా లయ నూతన  భవనానికి సంబం ధించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా సమాచార చిత్రపటాలను గోడలపై ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి సురేష్ బాబుకు కలెక్టర్ సూచించారు. తాను కూడా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో గ్రంధాలయాల్లోనే అభ్యసిం చానని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్‌తో పాటు జిల్లా గంధాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్శి సురేష్ బాబు లు ఉన్నారు.

రైతుల త్యాగం వేల కట్టలేనిది

కొడంగల్ ప్రాంత అభివృద్ధికి భూ సేకరణ ప్రక్రియకు సహకరిస్తున్న రైతుల త్యాగం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.   శనివారం కొడంగల్ ప్రాం తంలో పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పేం దుకు  భూసేకరణలో భాగంగా పోలేపల్లికి చెందిన  38 మంది రైతులకు కలెక్టరేట్ లోని విసి హాల్ నందు నష్టపరిహార చెక్కులను అందించి శాలువాలతో రైతులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి భూ సేకరణలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మీరు ఆదర్శంగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో తమ ప్రాంత అభివృద్ధి చేయాలన్న కల మీ త్యాగాల వల్ల నెరవేర బోతుందని కలెక్టర్ అన్నారు.  పరిశ్రమలు రావడం వల్ల  తమ కుటుంబాల్లోని పిల్లలకు  భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు  ఉంటాయని కలెక్టర్ తెలిపారు.