23-02-2025 06:49:49 PM
బాపూజీ వచనాల పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కోనేరు సాయికుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ లోని బాపూజీ సార్వజనిక వచనాలయంకు సంబంధించిన 2 ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాపూజీ వచనాల పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్ ఆరోపించారు. కబ్జాను తక్షణమే అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేనట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిజామాబాద్ లో 1923 సం.లో ఉన్న మూడు చారిత్రాత్మకమైన గ్రంథాలయాలు ఉరుకమారేడి గ్రంథాలయం, రైల్వే స్టాఫ్ గ్రంథాలయం, పూలంగ్ గులాంగ్ హైమదీ అంజుమన్ ఇస్తామియా దారులే ముతాలియా గ్రంథాలయంకు 1951లో బాపూజీ సార్వజనిక వచనాలయంగా పేరు మార్చబడిందని అన్నారు.
కాగా ఈ గ్రంథాలయం పేరును కొంత మంది అవినీతిపరులు సుధాకర్ రావు, గంగాధర్ తదితరులు కల్లు, సారాయి, లిక్కర్ వ్యాపారం చేసే వారు సిండికేట్ గా మారి బాపూజీ వచనాలయం డిజిటల్ లైబ్రరీగా పేరు మార్చారని ఆరోపించారు. వచనాలయం ద్వారా వచ్చిన అద్దె డబ్బులు రూ.80 లక్షలతో వారు తమ ఇష్టానుసారంగా 2 ఎకరాల స్థలంలో కట్టడాలను చేపడతున్నారని ఆరోపించారు. అలాగే సీడీఎఫ్ నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. కబ్జా కోరుల నుంచి గ్రంథాలయ స్థలాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.