calender_icon.png 30 September, 2024 | 9:58 AM

గ్రంథాలయాలను ప్రోత్సహిస్తాం

30-09-2024 01:44:46 AM

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):  రాష్ట్రంలో చిల్డ్రన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బాల చెలిమి గ్రంథాలయాలు బాలల చైతన్యానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర గ్రం థాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. చిల్డ్రన్స్ అకాడమీ, బాల చెలిమి సంయుక్త ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఆదివారం బాల చెలిమి గ్రంథాలయాలపై కార్యశాలలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ అకాడమీ అధ్యక్షులు, బాల చెలిమి సంపాదకులు ఎం.వేదకుమార్ అధ్యక్షత వహించారు. రియాజ్ మాట్లాడుతూ.. రానున్న గ్రంథాలయ వారోత్సవాల్లో బాల చెలిమి వారియర్స్ భాగస్వామ్యం అయ్యేలా ఒకరోజు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం బాల చెలిమి సంచికను అతిథులు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో సిద్దిపేట డిగ్రీ కళాశాల లైబ్రెరియన్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, సిటీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చేగోని రవికుమార్, రచయిత్రి డాక్టర్ అమరవాది నీరజ, మహా అకాడమీ డైరెక్టర్ మల్లికార్జున రావు, సంఘ సేవకుడు రాజలింగం, బాల చెలిమి గ్రంథాలయాల రాష్ట్ర కన్వీనర్ గరిపల్లి అశోక్ కుమార్, కోఆర్డినేటర్ ఖైజర్ భాషా, బాల చెలిమి గ్రంథాలయ ప్రతినిధులు, బాలల రచయితలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.