రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ప్రస్తుతం ఉన్న ఆదివారం సెలవు దినాన్ని మరో రోజుకు మార్చాలి. దీనివల్ల ఎక్కువమందికి లైబ్రరీలను ఉపయోగించుకొనే వీలు కుదురుతుంది. ప్రభుత్వ సంస్థలకు ఆదివారం సెలవు రోజు కాబట్టి, పలువురు ఉద్యోగస్తులు కాలక్షేపం కోసం గ్రంథాలయాలను వినియోగించుకొనే అవకాశమూ లభిస్తుంది. ఇంకా, విద్యార్థులు, నిరుద్యోగులకు ఆదివారం తీరికగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయాలకు శుక్రవారం సెలవు ఇస్తున్నారు. ఇదే పద్ధతిలో తెలంగాణలోని లైబ్రరీలకూ ఆదివారం తొలగించి శుక్రవారం లేదా మరో రోజు సెలవు దినం ఇవ్వాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్