calender_icon.png 14 March, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడిదారి దోపిడీ నుండి శ్రామిక వర్గానికి విముక్తి మార్గం చూపిన మార్క్స్

14-03-2025 07:16:51 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య

కొత్తగూడెం,(విజయక్రాంతి): దోపిడీ సమాజం నుండి విముక్తి పొందాలంటే వర్గ పోరాటాలు చేయాలని, సమ సమాజ స్థాపన జరగాలంటే మార్క్సిజం పునాదులపై ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మంచికంటి భవన్ లో కార్ల్ మార్క్స్ 142 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కనకయ్య మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ మరణించి 142 సంవత్సరాలు గడుస్తున్నపటికి ప్రస్తుతం ఉన్న సమాజ పరిణామ క్రమంలో చెక్కుచెదరని మార్క్సిజం సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కార్ల మార్క్స్ జీవితాన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

కార్ల్ మార్క్స్ జీవించి ఉన్న కాలంలో అనేకమంది తాత్వికవేత్తలు అనేక రకాలుగా సమాజాన్ని వర్ణించారని సమాజంలో ఉన్న సమస్యలు వెలుగు తీశారని ఆ సమస్యల పట్ల రకరకాల పరిష్కార మార్గాలు చూపినప్పటికీ 23 సంవత్సరాల యుక్త వయసు ఉన్న కార్ల్ మార్క్స్ సమాజాన్ని పరిశీలించడం కాదని, వ్యవస్థనే మార్చాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దోపిడి విధానంపై క్యాపిటల్  గ్రంధాన్ని ప్రపంచానికి అందజేసిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అని అన్నారు. పెట్టుబడిదారి సమాజంలో వస్తున్న అనేక రుగ్మతలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలంటేమార్క్సిజం ద్వారానే సాధ్యమని అన్నారు. దోపిడీ విధానానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు నిర్మించి సమ సమాజాన్ని నిర్మించే మార్క్సిజం సిద్ధాంతాలను పునికిపుచ్చుకొని కార్ల్ మార్క్స్ చూపిన సిద్ధాంత బాటలో నడిచే విధంగా ప్రతి ఒక్కరు ప్రతినబునాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కీ బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నందిపాటి రమేష్, జి రాజారావు వై వెంకటేశ్వర రావు, నాగకృష్ణ,నాజర్ తదితరులు పాల్గొన్నారు.