బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలోని పార్టీ శాసన సభాపక్ష కార్యాలయంలో గురువారం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన పార్టీ ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకో ర్టు ఆదేశాలను స్పీకర్ గడ్డ ప్రసాద్‌కుమార్ అమలు చేసేలా ఒత్తిడి తేవాల్సి ఉందన్నా రు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాల ని 20న ‘రైతు దీక్ష’ చేపడతామన్నారు.
పీఏసీ చైర్మన్ పదవికి ప్రతిపక్షం ముగ్గురి పేర్లు పంపించినప్పటికీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పదవి కట్టబెట్టడం సరికాదన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ మినహా ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, గోడం నగేష్, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, హరీశ్‌బాబు, రామారావు పటేల్, డి.సూర్యానారాయణ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
హైడ్రా పాతబస్తీకి ఎందుకు వెళ్లడం లేదు: ఎంపీ అర్వింద్
లౌకిక పార్టీ అని చెప్పుకుంటున్న కాంగెస్ పార్టీ ‘సెక్యులర్ హైడ్రాను ’ నడిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. కబ్జా నిర్మాణాలను ఎంపిక చేసి కూల్చ డం మాత్రమే కాకుండా ప్రణాళికాబద్ధంగా నేలమట్టం చేయాలని సూచించారు. రెండు రోజులకోసారి హైడ్రా తన విధానాలను మార్చుకోకూడదన్నారు. హైడ్రా పాతబస్తీకి వెళ్లడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నిం చారు. కబ్జాల విషయంలో ఒకరికి ఒక విధమైన న్యాయం, మరొకరికి మరో విధమైన న్యాయమేంటని నిలదీశారు.