08-04-2025 12:39:34 AM
కడ్తాల్, ఏప్రిల్ 7 : లంబాడి హక్కుల పోరాట సమితి మరో పోరాటానికి సిద్ధమయింది. 2019-21 సంవత్సరానికి గాను ట్రైకార్ లో ఉన్న 219 కోట్లను వెంటనే మంజూరు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని సోమవారం గిరిజన సంఘాలు చలో గిరిజన సంక్షేమ భవన్ పిలుపునిచ్చాయి.
ఇందుకుగాను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ ను కడ్తాల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు రావలసిన పెండింగ్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించి హడావిడి చేస్తుందని మండిపడ్డారు.
గత ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-21 సంవత్సరంల్లో గిరిజన యువతి యువకుల నుండి వేలాది దరఖాస్తులు స్వీకరించి అందులో నుండి 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించిందని తెలిపారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పేరుతో 30 వేల మంది గిరిజన యువతి యువకులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.